తెలంగాణ

telangana

ETV Bharat / state

వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయాలని దీక్ష - వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయాలని దీక్ష

సీపీఐఎంఎల్​ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్​ సాయిబాబాలను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

cpiml leader potu rangarao protest in khammam district
వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయాలని దీక్ష

By

Published : May 31, 2020, 7:39 PM IST

విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను మానవతా దృక్పథంతో వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. దేశంలో జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో దీక్ష చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ దీక్షలో కూర్చున్నారు.

మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామిక వాదుల పట్ల, ప్రశ్నించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో తప్పుడు ఆరోపణలపై జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్యం క్షీణించిందని, ఆయనకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వారిని వెంటనే విడుదల చేయాలని లేదా బెయిల్​ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: 'తెలంగాణలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details