తెలంగాణ

telangana

ETV Bharat / state

Chada: తెలంగాణ సాయుధ పోరాటం అజరామరం, అనిర్వచనీయం

సాయుధ వీరుల పోరాటం ఫలితంగానే భారతదేశంలో తెలంగాణ విలీనమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జాతా ఖమ్మం జిల్లాకు చేరుకుంది. ఈ నెల 11 నుంచి 17 వరకు జరగనున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆయన పాల్గొన్నారు.

cpi chada venkat reddy
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

By

Published : Sep 12, 2021, 5:19 PM IST

తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేటి పాలకులు తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి విమర్శించారు. ప్రపంచమంతా సాయుధ పోరాటాన్ని గుర్తించిందని అన్నారు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాల ఫలితంగానే 1948లో భారతదేశంలో తెలంగాణ విలీనమైందని ఆయన గుర్తు చేశారు. సాయుధ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జాతా ఖమ్మం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాయుధ పోరాట ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సాయుధ పోరాట ఫలితమే తెలంగాణ

సీపీఐ

ఈ నెల 11 నుంచి 17 వరకు జరగనున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా చాడ వెంకట్​ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో యాత్ర ముగించుకొని ఖమ్మం వచ్చిన ఆయనకు సరిహద్దులోని పైనంపల్లి వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీగా నేలకొండపల్లి చేరుకొని పాలేరు మాజీ ఎమ్మెల్యే కర్ణాటక కృష్ణయ్య స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజమైన తెలంగాణ అప్పటి సాయుధ పోరాటం ఫలితంగానే ఏర్పడిందన్నారు. సాయుధ వీరులకు 100 మందికి ఉరిశిక్ష పడితే ఏ ఒక్కరికీ కూడా అమలు కాలేదని తెలిపారు. ఈ నెల 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగుర వేయాలని చాడ డిమాండ్ చేశారు. తెరాసకు ఎంఐఎంతో దోస్తీ కారణంగానే తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు.

సీపీఐ ఆధ్వర్యంలో పోడు భూముల కోసం పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అన్యాయంపై ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని ఆయన అన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా నిత్యావసర సరుకులు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.

ఇదీ చూడండి:సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పెన్షన్‌ ఇవ్వాలి: సీపీఐ నారాయణ

ABOUT THE AUTHOR

...view details