పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బైపాస్ రోడ్డులోని భారత్ పెట్రోల్ బంకు వరకు ర్యాలీ తీశారు. అనంతరం బంకు ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ నిరసన - ఖమ్మం జిల్లా వార్తలు
ఖమ్మంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు ర్యాలీ చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ నిరసన
ఆటోకు తాళ్లు కట్టి లాగారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్తో ప్రజలు కష్టాల్లో ఉంటే వారి నడ్డి విరిచే విధంగా 13 రోజుల్లో 7 రూపాయల వరకు పెట్రోల్ ధరను పెంచడం సమంజసం కాదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కృష్ణా నదిలో వీర జవాన్ సంతోశ్బాబు అస్థికలు నిమజ్జనం