తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడు భూములు గిరిజనుల హక్కు: సీపీఐ ఎంఎల్ - గిరిజనుల హక్కు

గిరిజనుల జీవనాధారమైన పోడు భూముల సమస్యను రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 2006 అటవీ హక్కుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.

పోడు భూములు గిరిజనుల హక్కు: సీపీఐ ఎంఎల్

By

Published : Jul 2, 2019, 6:32 PM IST

రాష్ట్రంలో పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న గిరిజన ఆదివాసి రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు చేయటం అమానుష చర్య అని అభివర్ణించారు. అసలు సమస్య పక్కకు వెళ్లి అధికారులు, ఆదివాసీల మధ్య వివాదంగా తయారైందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

పోడు భూములు గిరిజనుల హక్కు: సీపీఐ ఎంఎల్

ABOUT THE AUTHOR

...view details