వసతి గృహాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఖమ్మంలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ధర్నా చేశారు. కొవిడ్ నివారణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా - ఖమ్మం తాజా వార్తలు
ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా చేశారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. కొవిడ్ నివారణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా
మహమ్మారి సోకి చనిపోయిన వారికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో నాయకులు భాగం హేమంతరావు, మౌలానా తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..