ఖమ్మంలో హత్యాచారయత్నానికి గురైన బాలికను సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడిచినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన ఘటన ఘోరమన్నారు.
హత్యాచారయత్నానికి గురైన బాలికను పరామర్శించిన సీపీఐ నేతలు - ఉస్మానియా ఆసుపత్రి లేటెస్ట్ వార్తలు
ఖమ్మంలో హత్యాచారానికి గురైన బాలికను సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించారు. ఇంట్లో కూలిపనులు చేసుకునే అమ్మాయిపై దాడిని ఆయన ఖండించారు.
హత్యాచారయత్నానికి గురైన బాలికను పరామర్శించిన సీపీఐ నేతలు
ఇంట్లో కూలి పనులు చేసుకుంటూ జీవించే అమ్మాయిపై అత్యాచారయత్నం చేయడాన్ని ప్రతిఘటించగా పెట్రోల్ పోసి నిప్పంటించడం దారుణమన్నారు. ఈ ఘోరాలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్భయ చట్టం వచ్చినా సరిగ్గా అమలు కావట్లేదని మహిళల రక్షణకు మరింత కఠినమైన శిక్షలు తేవాలన్నారు.
ఇదీ చదవండిఃహైదరాబాద్లో నేరాలు తగ్గాయి..