Cotton Farmers Problems Telangana 2023 :ఏటికేడు నష్టాలు మూటగట్టుకుంటున్నా.. సాగును వదిలిపెట్టకుండా ముందుకెళ్తున్న పత్తి రైతుల్ని(Cotton Farmers in Khammam).. కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రకృతి ప్రకోపం కర్షకులకు శాపంగా మారుతోంది. ఏపుగా పెరిగి కాత దశకు చేరుకోవాల్సిన సమయంలో.. ఎదుగూ బొదుగూ లేని పత్తి చేనును చూసి హలధారి బోరుమంటున్నాడు.పంటను వదిలేయలేక అదనపు పెట్టుబడులతో కాపాడుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నాడు. అయినప్పటికీ దిగుబడులు పెరిగే అవకాశం లేకపోవటం.. అన్నదాతల్ని మరింత కలవరపెడుతోంది.
Khammam Cotton Farmers Problems :ఖమ్మం జిల్లాలో లక్షా 79 వేల 287 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్షా 99 వేల 720 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ప్రస్తుత వానాకాలం సీజన్(Rainy Season)లో ఆరంభం నుంచే పత్తి రైతులకు పరీక్షే ఎదురవుతోంది. జూన్‌లో వర్షాలు ముఖాలు చాటేయటంతో రైతులు రెండు, మూడు సార్లు విత్తనాలు వేశారు. జులైలో అధిక వర్షాలు కురవటంతో మొలక దశలో ఉన్న పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆగస్టులో ఆశించిన వానలు లేక పత్తి పంట(Cotton Crop) ఎదుగుదల లేకుండా పోయింది. ఈ సమయానికి ఏపుగా పెరిగి కాయ దశకు చేరాల్సి ఉంది. మొక్క పెరుగుదల అనుకున్నట్లు లేకపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
Warangal Farmers Problems : సాగును కుదేలు చేస్తున్న ప్రకృతి ఉపద్రవాలు.. రైతుల కంట కన్నీళ్లు
Weather Conditions Troubling Cotton Farmers : వాతావరణ పరిస్థితులు, పత్తిలో ఎదుగుదల లేకపోవటం.. దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సగటు వర్షపాతం నమోదైనప్పటికీ.. సమయానుకూలంగా వానలు కురవక ఇబ్బందులు తప్పట్లేదు. సీజన్ ఆరంభం నుంచి ప్రతికూల వాతావరణం కారణంగా రైతులకు పెట్టుబడి భారం తడిసి మోపెడవుతోంది. కలుపుతీతతో పాటు పైర్ల ఎదుగుదల కోసం ఇబ్బడిముబ్బడిగా రసాయన మందులు(Chemical Drugs) పిచికారి చేయాల్సి వస్తుంది.