పత్తి(Cotton support price) ధరలు ఊరిస్తున్నా దిగుబడి తగినంత రాకపోవడంతో రైతులకు నిరాశే మిగులుతోంది! రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారులు మద్దతు ధరకన్నా ఎక్కువకే కొంటున్నారు. బహిరంగ మార్కెట్ ధర బాగా ఉండటంతో ‘భారత పత్తి సంస్థ’ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేదు. మద్దతు ధర క్వింటాకు రూ. 6,025 కాగా మార్కెట్లో రూ. 8 వేల దాకా పలుకుతోంది. తెలంగాణలో మొత్తం 380 జిన్నింగ్ మిల్లులున్నాయి. 8 నెలల పాటు మిల్లుల్లో జిన్నింగ్ చేయాలంటే కోటీ 20 లక్షల బేళ్ల పత్తి(Cotton support price) కావాలి. ఈ ఏడాది 40 లక్షల బేళ్లకు(Cotton support price) మించి రాదని అంచనా వేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రమేశ్ ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు చెప్పారు. గుజరాత్ మిల్లుల వ్యాపారులు కూడా తెలంగాణకు వచ్చి పత్తి కొంటున్నారు. దిగుబడి తగ్గిన కారణంగా ఇక్కడ ఐదారు నెలలు జిన్నింగ్ చేయడానికి(Cotton support price) కూడా పత్తి దొరకదని మిల్లుల యాజమానులు వాపోతున్నారు. అందుకే కొందరు పోటీపడి మద్దతు ధరకన్నా ఎక్కువ చెల్లించి పంట కొంటున్నారు.
*రాష్ట్రంలో అతిపెద్దదైన ఖమ్మం మార్కెట్‌కు 2020 ఏప్రిల్ నుంచి నవంబరు 11 దాకా 3.12 లక్షల బస్తాల పత్తి అమ్మకానికి తెస్తే ఈ ఏడాది అదేకాలంలో 2 లక్షల బస్తాలే తెచ్చారని మార్కెటింగ్ శాఖ తెలిపింది.
*రాబోయే 2 నెలలు రాష్ట్రంలో పత్తి మార్కెట్లకు అధికంగా వస్తుంది. ధర ఎంత ఇస్తారు, ఎంత పంట వస్తుందో ఇంకా వేచి చూడాలని మార్కెటింగ్ శాఖ భావిస్తోంది.
అంచనా 75 లక్షల ఎకరాలు.. సాగయ్యింది 46.5 లక్షలే..
రాష్ట్రంలో ఈ ఏడాది 75 లక్షల ఎకరాల్లో పత్తి(Cotton support price) సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎకరానికి 2 ప్యాకెట్ల విత్తనాలను చల్లుతారు కనుక గత మేలో ప్రైవేటు విత్తన కంపెనీల నుంచి కోటిన్నర ప్యాకెట్లు సిద్ధం చేయించింది. గతేడాది 60 లక్షల ఎకరాల్లో సాగవగా ఈసారి ఈ ఏడాది 46.50 లక్షల ఎకరాల్లోనే సాగుచేశారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు జులై నుంచి అక్టోబరు దాకా వర్షాలు బాగా పడటంతో లక్షలాది ఎకరాల్లో పూత, కాత సరిగా రాలేదు. అధిక తేమకు తెగుళ్లు పెరిగి దిగుబడి సగానికి సగం తగ్గడంతో ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి.