ఖమ్మం నగరంలో లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నగరంలోని 4,5,6 డివిజన్లలో కార్పొరేటర్లు పలువురికి భోజనం ప్యాకెట్లు అందజేశారు.
ఆహార పొట్లాలు పంపిణీ చేసిన కార్పొరేటర్లు - ఖమ్మం నగరం
ఖమ్మం నగరంలో లాక్డౌన్ నేపథ్యంలో పేదల కష్టాలు మరింతగా పెరిగాయి. వారి ఆకలి తీర్చేందుకు తెరాస కార్పొరేటర్లు ముందుకు కదిలారు. రోజూ అన్నదానం చేస్తూ ఆకలిని తీర్చుతున్నారు.
![ఆహార పొట్లాలు పంపిణీ చేసిన కార్పొరేటర్లు Corporators who distribute food packets at khammam city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6761093-1032-6761093-1586675627272.jpg)
ఆహార పొట్లాలు పంపిణీ చేసిన కార్పొరేటర్లు
గత నాలుగు రోజులుగా రోజుకు 14 వందల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్లు కార్పొరేటర్లు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిత్యం అన్నదానం చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి :ఇంట్లోనే ఉన్నారు... కరోనాను జయించారు