తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్​ - khammam district news

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఖమ్మం నగరంలో 15 మందికి కరోనా పాజిటివ్​గా తేలగా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదుగురికి కరోనా సోకింది. కరోనా కేసులు పెరగడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

corona virus update in joint khammam district
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్​

By

Published : Jul 17, 2020, 10:15 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగతున్నాయి. ఖమ్మం నగరంలో శుక్రవారం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇంత వరకు ఖమ్మం జిల్లాలో 225 మందికి నిర్ధారణ కాగా.. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 147 మంది చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం 5 కరోనా కేసులు నిర్దారణ అయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 20 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన గాంధీచౌక్‌లో కరోనాతో ఇద్దరు వ్యాపారులు మృతి చెందారు. దీంతో గత రెండు రోజులుగా పని వేళలు కుదించారు. తాజాగా వర్తక సంఘం ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. ఈనెల 21 నుంచి 28 వరకు పూర్తిగా దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. కరోనా వైరస్‌ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవీ చూడండి: కృత్రిమ పడకల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details