రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతుండటం పట్ల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కొవిడ్‌కు చికిత్స ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలోని 50 శాతం పడకలను వెంటనే ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలని ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు.
'వారికి రూ.50లక్షలు, వీరికి రూ.10లక్షలివ్వాలి'
కరోనాకు క్వారంటైన్ కేంద్రాలను జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్ రోగులకు వైద్యం అందిస్తూ దురదృష్టవశాత్తు మృతి చెందిన వైద్య సిబ్బందికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. సాధారణ పౌరుడు మరణిస్తే రూ.10 లక్షల అందించాలని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సర్వీసుల కింద ప్రజలకు తగిన సౌకర్యాలు, రక్షణ కల్పించాలని భట్టి విక్రమార్క కోరారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : భట్టి విక్రమార్క ఇవీ చూడండి : ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులతో మంత్రి ఈటల సమీక్ష