మంత్రి పువ్వాడ అజయ్‌కు కరోనా పాజిటివ్ - minister ajay tweet
మంత్రి పువ్వాడ అజయ్‌కు కరోనా పాజిటివ్
09:35 December 15
మంత్రి పువ్వాడ అజయ్‌కు కరోనా పాజిటివ్
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా సోకింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలో తనకు కొవిడ్- 19 పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ఆయన వివరించారు.
కరోనా నుంచి త్వరగా కోలుకొని యథావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన వివరించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి అజయ్ విజ్ఞప్తి చేశారు.
Last Updated : Dec 15, 2020, 10:12 AM IST