కరోనా వైరస్ నియంత్రణలో.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కేసులు పెరిగాయని.. రాష్ట్ర రాజధానిలో వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జిల్లాలకు వచ్చిన వలస కూలీలను క్వారంటైన్ చేయకుండా..నేరుగా స్వగ్రామాలకు పంపించడం వల్ల కరోనా తిరిగి విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
"ప్రభుత్వ వైఫల్యం వల్లే.. కరోనా కేసులు రెట్టింపు" - Carona Latest News
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల.. కరోనా కేసులు పెరిగాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలకు వచ్చిన వలస కూలీలను క్వారంటైన్ చేయకుండా.. నేరుగా స్వగ్రామాలకు పంపించడం వల్ల కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
"ప్రభుత్వ వైఫల్యం వల్లే.. కరోనా కేసులు రెట్టింపు"
మహారాష్ట్ర నుంచి ఖమ్మం జిల్లా మధిరకు వచ్చిన వారిని ఇళ్లలోకి పంపించారని.. వైద్యపరీక్షలు నిర్వహించలేదని మండిపడ్డారు. ఈవిషయంలో ప్రభుత్వం స్పందించక పోతే.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గంలో సొంత ఖర్చులతో క్వారంటైన్ నిర్వహించి తామే వసతి, భోజనం కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కాపాడుకున్న గ్రామాలన్నీ ప్రమాదంలో పడుతున్నాయని దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు