ఖమ్మం నగరంలో ఎంతో ప్రతిష్టాత్మక లకారం చెరువు వద్ద నిర్మాణ లోపాలు బయట పడుతున్నాయి. గతంలో చెరువు కట్టకు పగుళ్లు ఏర్పడగా... మరమ్మతులు చేశారు. తాజాగా చెరువుకు గండి పడి నీరు వృథాగా పోతోంది. ఇటీవల సాగర్ కాలువ నుంచి లకారం చెరువుకు నీటిని తరలించడం వల్ల నిండుకుండలా మారింది. చెరువుకు పెద్ద గండి పడితే నీరంతా లోతట్టు ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉంది. నీటి పారుదలశాఖ ఇంజినీర్లు మాత్రం గతంలో ఉన్న తూము వద్ద లీకులు ఏర్పడ్డాయని వాటికి మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారు.
బయటపడుతున్న లకారం చెరువు నిర్మాణ లోపాలు - lakaram tank bund
ఖమ్మం లకారం చెరువు వద్ద లోపాలు బట్టబయలవుతున్నాయి. గతంలో చెరువు కట్టకు పగుళ్లు ఏర్పడగా.. తాజాగా చెరువు కట్టకు గండి పడి నీరు వృథాగా పోతోంది.
బయటపడుతున్న లకారం చెరువు నిర్మాణలోపాలు