ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యటించారు. ఎమ్మెల్యేకు ద్విచక్ర వాహనాల ర్యాలీతో చింతగూడెం గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
పాఠశాలలో సమస్యలు పరిష్కరిస్తా
బాలల దినోత్సవం సందర్భంగా చింతగూడెం ఉన్నత పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. పాఠశాలకు చెందిన 33 మంది విద్యార్థులకు రవాణా ఛార్జీ కింద ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున రూ.1.98 లక్షలు అందించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పదో తరగతి పరీక్ష నిర్వహించే కేంద్రాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి బెంచీలు అందిస్తున్నట్లు తెలిపారు. చింతగూడెం పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
చింతగూడెం గ్రామంలో ఎమ్మెల్యే సండ్ర పర్యటన ఇదీ చూడండి: ఖమ్మంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన పువ్వాడ