పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకోలెక్కన పెంచుతున్న కేంద్రం... ప్రజల రక్తాన్ని పీల్చుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినా... కేంద్రం మాత్రం పెంచుకుంటూ పోతోందని భట్టి ఆరోపించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారన్నారు. ఇప్పటికైనా పెరిగిన ధరలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్రం.. ప్రజల రక్తాన్ని పీల్చుతోంది: భట్టి విక్రమార్క - ccongress protest on petrol price news
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
![కేంద్రం.. ప్రజల రక్తాన్ని పీల్చుతోంది: భట్టి విక్రమార్క Congress protest on petrol and disel price hike in khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7817171-628-7817171-1593425946233.jpg)
కేంద్రం.. ప్రజల రక్తాన్ని పీల్చుతోంది: భట్టి విక్రమార్క
కేంద్రం.. ప్రజల రక్తాన్ని పీల్చుతోంది: భట్టి విక్రమార్క