క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ నేత భట్టి విక్రమార్క ప్రజలను కాపాడాలని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని సూచిస్తే... అధికార పార్టీ వాళ్లు తమ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ అన్నారు.
'సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై విమర్శలు సరికాదు' - clp leader batti vikramarka news
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై తెరాస నాయకులు విమర్శలు చేయడం సరికాదని ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు.కార్పొరేటర్ల పట్ల ప్రోటోకాల్ పాటించాలని మాజీ ఎంపీ రేణుకా సూచిస్తే దానిపై కూడా విమర్శలు చేయడం తగదన్నారు.
'సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై విమర్శలు సరికాదు'
తెరాస నాయకులు భట్టిని ఖమ్మం లో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారని... అందుకు తమ నాయకుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్పొరేటర్ల పట్ల ప్రోటోకాల్ పాటించాలని మాజీ ఎంపీ రేణుకా సూచిస్తే దానిపై కూడా విమర్శలు చేయడం తగదన్నారు.
ఇదీ చదవండి: ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!