తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress MLA Tickets Disputes in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతల పట్టు.. తేలని సీట్లు

Congress MLA Tickets Disputes in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి అత్యంత సంక్లిష్టంగా మారింది. ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించగా.. మిగిలిన స్థానాల్లో ఎంపిక కోసం పార్టీ స్క్రీనింగ్ కమిటీకి కత్తిమీద సాములా మారింది. తాము ప్రతిపాదించిన అభ్యర్థుల కోసం ముఖ్య నేతల పట్టుతో.. పంచాయితీ పార్టీ పెద్దలకు చేరింది.

Congress
Congress

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 10:07 AM IST

Congress MLA Tickets Disputes in Joint Khammam District ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉత్కంఠ వీడని అభ్యర్థుల ప్రకటన

Congress MLA Tickets Disputes in Joint Khammam District : కాంగ్రెస్ శ్రేణులు, ఆశావహ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైనా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేసు గుర్రాల లెక్క మాత్రం తేలలేదు. ఖమ్మం అసెంబ్లీ నుంచి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు తొలి జాబితాలో సిట్టింగ్‌ స్థానాలైన మధిర మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం పొదెం వీరయ్యను ప్రకటించింది.

Telangana Congress MLA Tickets 2023 : కాంగ్రెస్ రెండో జాబితాలో రెడ్డి, బీసీలకు పెద్దపీట.. 10 మంది మహిళలకు ఛాన్స్

దీంతో జిల్లాలో ఐదు స్థానాల్లో బరిలోకి దించినట్లైంది. వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట స్థానాల్లో ఎవరు పోటీలో ఉంటారనే ఉత్కంఠ వీడలేదు. సర్వేల ప్రకారం చూస్తే ఒకలా.. జిల్లాలోని సీనియర్ నేతలు తమ అనుచరుల కోసం పట్టుబడుతుండటంతో పరిస్థితి మరోలా మారింది. తద్వారా అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి అగ్నిపరీక్షగా మారింది. వామపక్షాలతో హస్తం పార్టీ పొత్తు ఖరారైనప్పటికీ.. రెండు స్థానాల్లో(MLA Tickets) పీటముడి వీడటం లేదు.

కొత్తగూడెం సీపీఐకి ఇవ్వడం ఖాయమన్న ప్రచారం ఉన్నా.. అధికారికంగా ప్రకటన వెలువడలేదు. జిల్లాలో సీపీఎంకు సీటు కేటాయించాల్సి ఉండటంతో ఎక్కడ ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. పాలేరు, భద్రాచలం స్థానాల్లో ఒకటి ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతున్నప్పటికీ.. అవి ఇచ్చే ప్రసక్తే లేదని రెండు స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇందుకు బదులుగా వైరా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినా సీపీఎం అంగీకరించలేదు. ఫలితంగా ఆ స్థానంలో అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచింది.

Congress Ticket Issues in Mahabubnagar District : ఉమ్మడి పాలమూరులో అసంతృప్తి మంటలు.. కాంగ్రెస్‌కు పెద్ద సవాలే

Congress MLA Tickets Issue in Joint Khammam District : సత్తుపల్లి, ఇల్లందు, అశ్వారావుపేటలో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీకి తలనొప్పిగా మారింది. ఈ స్థానాల్లో పోటీ కోసం జిల్లా ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రేణుకా చౌదరి (Renuka Chowdary) ఎవరి అనుచరుల కోసం వారు గట్టిగా ప్రయత్నిస్తుండటం వల్ల.. ఎంపిక సంక్లిష్టంగా మారింది. సత్తుపల్లిలో మట్టా దయానంద్‌ కానీ, ఆయన భార్య మట్టా రాగమయికి ఇవ్వాలని రేణుకా చౌదరి కోరుతున్నారు.

Telangana Assembly Elections 2023 : ఇదే స్థానంలో తన అనుచరుడు కొండూరి సుధాకర్‌కు అభ్యర్థిత్వం ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరుతున్నారు. మాదిగ సామాజిక వర్గం కోటాలో సీటు కేటాయించాలని వక్కలగడ్డ చంద్రశేఖర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లందులో తన అనుచరుడైన జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య కోసం పొంగులేటి పట్టుబడుతుండగా.. చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవి నాయక్‌లలో ఒకరికి వచ్చేలా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పావులు కదుపుతున్నారు.

Revanth Reddy Contest from Kamareddy : 'హై కమాండ్ ఆదేశిస్తే.. కామారెడ్డిలో కేసీఆర్​పై పోటీ చేస్తా'

అశ్వారావుపేటలోనూ అభ్యర్థుల పోటీ కన్నా.. నాయకుల మధ్య టికెట్ పోరు తారాస్థాయికి చేరింది. ఇక్కడ జారె ఆదినారాయణకు టికెట్ దక్కించుకునేందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) ప్రయత్నాలు చేస్తున్నారు. సున్నం నాగమణి కోసం.. భట్టి విక్రమార్క పట్టుబడుతుండగా.. పీసీసీ పెద్దల సాకారంతో తాటి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం అన్ని విధాలా అర్హులని తేల్చిన తర్వాతే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

"టికెట్లు ఆశించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఏఐసీసీ టికెట్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటాం." - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్

రెండో జాబితాలోనైనా తమ అభ్యర్థిత్వం ఖరారవుతుందని ఎదురుచూస్తున్న నేతలు.. స్పష్టత రాకపోవడంతో నిరీక్షణ తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నెలాఖరులోగా మూడో జాబితా ప్రకటించే వరకు ఆశావహులు, కాంగ్రెస్ శ్రేణులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Telangana Congress Vijayabheri Bus Yatra : నేడు సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ బస్సు యాత్ర.. ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే

Ponguleti Reaction on CM KCR Comments : 'నేను నిజాయతీగా సంపాదించి రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నా.. మీరు ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పాలి'

ABOUT THE AUTHOR

...view details