రైతుల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుకై దిల్లీలో ఆందోళనలు చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా భారీ ప్రదర్శనలు చేపడుతామని తెలిపారు.
'రైతులకు మద్దతుగా 28న ఖమ్మంలో భారీ ప్రదర్శన' - రైతులకు మద్దతుగా కాంగ్రెస్ భారీ ప్రదర్శన
నూతన వ్యవసాయం చట్టాల రద్దుకై దిల్లీలో పోరాడుతున్న రైతులకు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. పట్టణంలో ఈనెల 28న చేపట్టిన మార్చ్ఫ్లాగ్ కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రైతుల దీక్షలకు మద్దతుగా భారీ ప్రదర్శన : దుర్గాప్రసాద్
కర్షకుల దీక్షకు మద్దతుగా ఈనెల 28న పట్టణంలో పెవిలియన్ మైదానం నుంచి ధర్నాచౌక్ వరకు భారీఎత్తున మార్చ్ఫ్లాగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులకు మద్దతుగా నిలిచే ప్రతిఒక్కరూ పాల్గొనవచ్చన్నారు. జాతీయ జెండాలను ప్రదర్శించి రైతులకు సంఘీభావం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.