ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో 2 పడక గదుల ఇళ్లు నాసిరకంగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో, నాసిరకం పనులను బయటపెట్టిన యువకులపై కేసు నమోదు చేశారు. దీనితో డీసీసీ నాయకులు దుర్గాప్రసాద్ జేడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం పర్యటించి.. ఇళ్లను పరిశీలించారు.
ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా?: కాంగ్రెస్ నాయకులు - congress leaders visit 2 bedroom houses at khammam district
ఖమ్మం జిల్లాలో 2 పడక గదుల ఇళ్లను డీసీసీ నాయకులు పరిశీలించారు. నిర్మాణాల నాణ్యతా లోపాలు బయటపెట్టిన యువకుల మీద కేసులు పెట్టడాన్ని వారు ఖండించారు.

ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా?: కాంగ్రెస్ నాయకులు
నిర్మాణాల నాణ్యతా లోపాలు బయటపెట్టిన యువకుల మీద కేసులు పెట్టడాన్ని వారు ఖండించారు. అధికారులు స్పందించి.. నాణ్యత ప్రమాణాలు పాటించని గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని అవినీతికి పాల్పడిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటి నిర్మాణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు
TAGGED:
khammam district news