పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో రింగ్ రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన - khammam news in telugu
ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రింగ్‌రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
congress leaders protest in vyra against petrol and deisel rates hyke
గడిచిన నెల రోజుల్లో రెండు దఫాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల మధ్య తరగతి వర్గాలపై పెను భారం పడిందని దుర్గాప్రసాద్ అన్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరింత అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.