ఖమ్మం నగరపాలక సంస్థకు ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బుధవారం రాత్రి.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు, కార్యకర్తలు కలిసి ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బల్దియాలో రాజకీయ వేడి.. కాంగ్రెస్ కార్యకర్తల నిర్బంధం - congress activists protests in khammam municipal corporation
ఖమ్మం 58వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అన్యాయంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. వారిని విడిచిపెట్టేంత వరకు కదిలేది లేదని స్థానికి పీఎస్ ఎదుట బైఠాయించారు.
![బల్దియాలో రాజకీయ వేడి.. కాంగ్రెస్ కార్యకర్తల నిర్బంధం congress activists protests in khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:18:02:1619678882-11572723-kmm.jpg)
ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
58వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ఆరోపిస్తూ పీఎస్ ఎదుట ఆందోళన చేశారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పై కేసు నమోదు