తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో అధ్వానంగా మారిన రహదారులు.. అడుగడుగుకు గోతులు - తెలంగాణ వార్తలు

Roads Bad in Khammam District: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. జాతీయ రహదారులు కొద్ది మేరకు బాగానే ఉన్నా.. రాష్ట్రీయ, గ్రామీణ రహదారుల పరిస్థితి వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి. నెలల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో, ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి వేళలో ప్రయాణం భయాందోళనకు గురిచేస్తోంది.

Roads Bad in Khammam District
Roads Bad in Khammam District

By

Published : Dec 9, 2022, 5:44 AM IST

Roads Bad in Khammam District: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రయాణాలకు వీలు లేకుండా పోతున్నాయి. అడుగడుగుకు గోతులు ఏర్పడుతున్నా, ఆ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్డడం లేదు. కొన్ని చోట్ల మరమ్మతులకు కూడా వీలులేనంతగా రోడ్లు దెబ్బతిన్నా, ఏ మాత్రం స్పందించడం లేదు. ఖమ్మం జిల్లాలో ప్రధాన పట్టణాలను కలిపే రహదారులు చాలా వరకు దెబ్బతిన్నాయి.

గోతుల రహదారుల్లో ప్రయాణించి చాలా మంది ప్రమాదాలకు గురికాగా, పలువురు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. దెబ్బతిన్న రహదారుల నుంచి వచ్చే దుమ్ముతో, వాహనదారులు సమీప గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, మధిర వెళ్లే రహదారులు చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి. వైరా నుంచి జగ్గయ్యపేట, మధిర వెళ్లే ప్రయాణికులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాత్కలికంగా కంకర్ పోస్తున్నారు. వార్షాలకు అవి మళ్లీ లేచిపోతున్నాయి. వర్షానికి నీళ్లు నిలబడుతున్నాయి. అవే గుంతలు వస్తున్నారు చుసుకుంటున్నారు వెళ్లిపోతున్నారు కానీ పట్టించుకునే వారు ఒక్కరు లేరు. వర్షం కురిస్తే ఎక్సిడేంట్​లు అవుతున్నాయి. నైట్ చాలా మంది కింద పడుతున్నారు. మొన్న ఒక బైక్ అతను కింద పడ్డాడు. అంతకుముందు ఆటోకి ఎక్సిడెంట్ అయ్యింది. కాళ్లు చేతులు ఇరిగాయి. ఈ గుంతల వలన వ్యాన్ తొక్కింది. స్పాట్ డెడ్ అయిపోయ్యాడు. అనేక రకాల ఎక్సిడెంట్​లు జరుగుతున్నాయి. -గ్రామస్థులు

సోమవరం, తాటిపుడి, రెబ్బవరం, పాలడుగు వద్ద.. పెద్ద గోతులతో వాహనదారులు కిందపడుతున్నారు. పల్లిపాడు నుంచి ఏన్కూరు రహదారిలోనూ ఇదే పరిస్థితి ఉంది. నిత్యం కొత్తగూడెం వెళ్లే వందలాది వాహనాలు.. ఈ మార్గంలోనే వెళ్తున్నారు. పెద్ద గోతులు ఉండటంతో, ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు, తల్లాడ, ఇల్లెందు, చండ్రుగొండ ప్రాంతాల్లోనూ రోడ్లు ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్నాయి.

రహదారులు, భవనాలశాఖ రోడ్లు మరమ్మతులలో తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఆ శాఖ తీరుపై ఇటీవల మధిర రహదారిపై.. సీపీఐ నేతలు ధర్నా చేశారు. రాష్ట్రాలను కలిపే రహదారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొత్తగూడెం రహదారిలోనూ పలుచోట్ల ఆందోళనలు చేశారు. తక్షణమే నిధులు మంజూరు చేయాలని.. నాయకులు డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details