లాక్ డౌన్ కారణంగా.. రాజకీయాలకు అతీతంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో మెగా రక్తదాన శిబిరంను ఆయన ప్రారంభించారు. విపత్తు సమయంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. పేద ముస్లిం ప్రజలకు ఇఫ్తార్ కిట్లను పంపిణీ చేశారు.
సమగ్ర వ్యవసాయ విధానం లాభదాయకం: ఎమ్మెల్యే సండ్ర - సత్తుపల్లి మండలం కిష్టారంలో మెగా రక్తదాన శిబిరం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విపత్తు సమయంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. పేద ముస్లింలకు ఇఫ్తార్ కిట్లను పంపిణీ చేశారు.

సమగ్ర వ్యవసాయ విధానం లాభదాయకం: ఎమ్మెల్యే సండ్ర
అనంతరం రాయితీపై ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలను సండ్ర వెంకట వీరయ్య రైతులకు అందజేశారు.. ప్రతి సారి ఒకేరకం పంట వేయడం ద్వారా రైతులకు లాభం రాదని.. ప్రభుత్వం సూచించిన నియమాలను రైతులు అమలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి:చిదిమిపోయిన చిరు వ్యాపారుల బతుకులు!