ఖమ్మంలో లాక్ డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. లాక్ డౌన్ అమలవుతోన్న సమయాల్లో ప్రజలు బయటకు రావట్లేదు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం చెల్లించిన రూ.1500ల నగదును తీసుకునేందుకు లబ్ధిదారులు దశల వారిగా బ్యాంకుల వద్దకు వెళ్తున్నారు. కూలీలు, అన్నార్తుల ఆకలి తీర్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వీధుల వెంట అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసి ఆహారం అందిస్తున్నారు.
లాక్ డౌన్‌కు సహకరిస్తున్న ఖమ్మం ప్రజలు - లాక్ డౌన్‌కు సహకరిస్తున్న ఖమ్మం ప్రజలు
ఖమ్మం జిల్లాలో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ లాక్ డౌన్‌కు పూర్తిగా సహకరిస్తున్నారు. పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఖమ్మంలో లాక్ డౌన్... ప్రజలంతా ఇళ్లలోనే