తెలంగాణ

telangana

ETV Bharat / state

కేఎంసీ ఉద్యోగుల మధ్య గొడవ.. పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు.. - కేఎంసీ ఉద్యోగుల మధ్య గొడవ

ఖమ్మం నగరపాలక సంస్థ ఉద్యోగుల మధ్య ఘర్షణ మరోసారి రోడ్డెక్కింది. నగర పాలకసంస్థ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఇద్దరు ఉద్యోగులు బాహాబాహీకు దిగి ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. చివరికి పోలీస్​ స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

compalint against quarrel between khammam municipal corporation
కేఎంసీ ఉద్యోగుల మధ్య గొడవ.. పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు

By

Published : Jun 17, 2020, 2:24 PM IST

ఖమ్మం నగరపాలక సంస్థ ఉద్యోగులు మరోసారి ఘర్షణ పడ్డారు. సంస్థ కార్యాలయంలో శాశ్వత ఉద్యోగిగా పనిచేస్తున్న సుధాకర్​కు పొరుగు సేవల ఉద్యోగుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. వివాదాలు పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకుని.. చివరికి పీఎస్​లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను పురుగుల కన్నా హీనంగా చూస్తూ వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి బుధవారం గొడవగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మొత్తానికి ఉద్యోగుల మధ్య లొల్లి... కేఎంసీ అధికారులకు తలనొప్పిగా మారింది.

ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details