ఖమ్మం జిల్లా మధిరలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమానికి లైయన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ మల్లాది వాసు సవిత దంపతులు హాజరయ్యారు. గ్రామ రాశి ఉత్సవ కమిటీ నిర్వాహకులు రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలకు గర్భిణీ సమయం నుంచి ప్రసవం వరకు తీసుకోవాల్సిన పౌష్టికాహారాన్ని మండల వైద్యాధికారి శ్రీనివాసరావు వివరించారు. అనంతరం మహిళలకు తెలుగు సాంప్రదాయ బద్ధంగా పూలు, పళ్లు చీరలు అందించారు.
మధిరలో సామూహిక సీమంతాలు - మధిరలో
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిరలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. మహిళలకు గర్భిణీ సమయం నుంచి ప్రసవం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మండల వైద్యాధికారి వివరించారు.
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు