ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని పలు గ్రామాలలో రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నాయకన్‌గూడెం, లింగారం తండా గ్రామాలను పరిశీలించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం సరిగా లేకపోవడం వల్ల కలెక్టర్ మోటర్ సైకిల్ నడుపుతూ గన్యగండాకు చేరుకొని గ్రామ పంచాయతీని తనిఖీ చేశారు.
మోటర్ సైకిల్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - District Collector RV Karnan abruptly checks on second phase of village development
మోటర్ సైకిల్‌పై ఓ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారులను రెండో విడత పల్లె ప్రగతి పనుల గురించి ఆరా తీశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
మోటర్ సైకిల్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గ్రామంలో పరిస్థితుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. మొక్కల పెంపకం, రోడ్ల శుభ్రత, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'ఒంటరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం'