ఖమ్మం జిల్లా వైరా మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాడిపుడి పంచాయతీలో నర్సరీని పరిశీలించిన కలెక్టర్... అక్కడ మొక్కలు లేకపోవటం వల్ల పంచాయతీ కార్యదర్శి సతీశ్, ఉపాధిహామి క్షేత్రసహాయకురాలు మల్లేశ్వరిని సస్పెండ్ చేశారు. వీధుల వెంట పేరుకుపోయిన చెత్తకుప్పలు చూసి సర్పంచిని నిలదీశారు. వెంటనే చెత్త తొలగించాలని ఆదేశించారు. నిర్లక్ష్యానికి బాధ్యతగా ఎంపీడీవో రామ్మోహనరావుకు షోకాజు నోటీసులిచ్చారు. రెబ్బవరం పంచాయతీలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక పనులు తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
నర్సరీలో మొక్కలు నిల్..అధికారుల సస్పెండ్ - నర్సరీలో మొక్కలు నిల్..అధికారుల సస్పెండ్
మొక్కలు లేవని పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ క్షేత్ర సహాయకురాలిని ఖమ్మం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాడిపుడిలో పల్లెప్రగతి కార్యక్రామాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేసి... అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశారు.
![నర్సరీలో మొక్కలు నిల్..అధికారుల సస్పెండ్ COLLECTOR SUDDEN VISIT... OFFICERS SUSPEND](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5590651-thumbnail-3x2-ppp.jpg)
COLLECTOR SUDDEN VISIT... OFFICERS SUSPEND