తెలంగాణ

telangana

By

Published : Jun 6, 2021, 1:26 PM IST

ETV Bharat / state

'ఆక్సిజన్​, రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి'

ఖమ్మంలో ఆక్సిజన్​, రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మధిరలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్​ను ఆయన ప్రారంభించారు.

Collector started an oxygen plant in Madhira, Khammam district
Collector started an oxygen plant in Madhira, Khammam district

ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్​రాజు, కలెక్టర్ ఆర్.వి కర్ణన్ చేతుల మీదగా సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి, ఆశాజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ చొరవతో.. ప్రవాసాంధ్రుల ఆర్థిక సహకారంతో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేశారు.

శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవలు అమోఘమని కలెక్టర్ ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆక్సిజన్​తో పాటు రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి మాలతి, సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ సుధాకర్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details