తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కలెక్టర్ కర్ణన్ - కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పారిశుద్ధ్య పనుల పరిశీలన

సత్తుపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. రాజీవ్ నగర్​లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కలెక్టర్, జడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి పర్యవేక్షించారు.

Collector R.V. Karnan, MLA Sandra Venkataveeraiah  Sanitation works In Satupally
'గౌరీ గూడెంలో రెండు పడక గదుల ప్రారంభం'

By

Published : Jun 3, 2020, 11:06 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. సత్తుపల్లి మండలం రాజీవ్ నగర్​లోని పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను కలెక్టర్, జడ్పీ సీఈవో ప్రియాంక తో కలిసి పర్యవేక్షించారు.

పల్లెప్రగతి పరిశీలన

గౌరీ గూడెంలో నూతనంగా నిర్మించిన రెండు పడక గదులను కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ప్రారంభించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా సదాశివుని పాలెంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామం వద్ద పూజలు చేశారు. అనంతరం ఇళ్ల వద్ద నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ మహేశ్, కమిషనర్ సుజాత, ఎంపీపీ హైమావతి, జడ్పీటీసీ సభ్యుడు రామారావు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మెట్రో టికెట్​ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details