ఖమ్మం జిల్లాలో ఈనాడు- కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఇంటర్ తర్వాత ఎంచుకోవాల్సిన కోర్సులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్... విద్యార్థులతో మమేకమయ్యారు. మోటివేటర్ అవతారమెత్తి.. విద్యార్థులకు చదువు పాఠాలతో పాటు జీవిత పాఠాలను బోధించారు.
ఓటమి అంతం కాదు..ఆరంభం: కలెక్టర్ - eenadu and kl university special program for inter students
ఆయనో ఐఏఎస్ అధికారి. ఓ జిల్లాకు కలెక్టర్. ఎన్నో ఓటములు చవిచూశారు. ఏ మ్యాథ్స్లోనో, సైన్స్ లోనో కాదు..ఏకంగా తెలుగులోనే ఫెయిల్ అయ్యారు. అయినా కుంగిపోలేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇప్పుడు తన అనుభవాలే పాఠాలుగా భావిభారత పౌరులకు జీవిత పాఠాలు నేర్పుతున్నారు. అతనే ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్...
'మోటివేటర్ అవతారమెత్తిన కలెక్టర్
ఓటమి జీవితానికి అంతం కాదని.. అది ఆరంభం కావాలని విద్యార్థులకు కలెక్టర్ కర్ణన్ సూచించారు. ఓటమి పాఠాల నుంచి గెలుపును చూసిన మహోన్నత వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమికి కుంగిపోమని...ఆత్మహత్యలు చేసుకోబోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
- ఇదీ చూడండి : ఆదర్శం: అప్పు ఇవ్వలేదని బ్యాంకే పెట్టేసింది