ఖమ్మం జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాల్లో కరోనా టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శనివారం నాడు ప్రధాని ప్రసంగం అనంతరం జిల్లాలోని 6 కేంద్రాల్లో టీకాలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిల్వ చేసిన టీకాలను జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజుతో ఆయన పరిశీలించారు. టీకా పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు.
తొలిరోజు ఆరు కేంద్రాల్లో టీకా పంపిణీ: కలెక్టర్
ఖమ్మం జిల్లావ్యాప్తంగా రేపు 6 కేంద్రాల్లో టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ప్రధాని ప్రసంగం అనంతరం టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిల్వ చేసిన టీకాలను ఆయన పరిశీలించారు.
ఖమ్మం జిల్లాలో రేపు 6 కేంద్రాల్లో టీకా పంపిణీ: కలెక్టర్
జిల్లా ప్రధాన ఆస్పత్రి, ముస్తాఫనగర్, వెంకటేశ్వరనగర్ ప్రాథమిక కేంద్రాలు, సత్తుపల్లి, మధిర, బోనకల్లు మండల కేంద్రాల్లో తొలిరోజు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా ముందు వైద్యసిబ్బందికి టీకాలు వేస్తామన్నారు.
ఇదీ చదవండి:తొలిరోజు 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా