ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్ల పెంటలో త్వరలోనే అర్హులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని... కలెక్టర్ ఆర్ వి కర్ణన్ స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామంలో భూములు సర్వే చేసి కొంతమందికి పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంతో... సమస్యను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ఆదేశాలతో బాధిత రైతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
గతంలో సర్వే చేసిన సమయంలో ఆ భూములకు సంబంధించిన రైతులు లేకపోవడంతో అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదని అన్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.