ఖమ్మం జిల్లాలో మూడు డీపోల నుంచి 180 బస్సుల ద్వారా ఆర్టీసీ సేవలు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ అన్నారు. ఖమ్మం బస్టాండ్‌ను ఆయన సందర్శించారు. ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. బస్సు ఎక్కి శానిటైజర్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించిన కలెక్టర్ - collector rv karnan visit khammam bus stand
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ ఇవాళ బస్టాండ్‌లో పర్యటించారు. ఈరోజు నుంచి బస్సులు ప్రారంభమైన సందర్భంగా అక్కడ తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు. కేవలం బస్సు సర్వీసులు రాష్ట్రంలో మాత్రమే నడుస్తాయని తెలిపారు.
ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించిన కలెక్టర్
హైదరాబాద్ వైపు వెళ్లే బస్సులు హయత్‌నగర్ వరకు మాత్రమే వెళ్తాయన్నారు. ఖమ్మం జిల్లాకు ఆనుకుని ఉన్న కృష్ణా జిల్లాకు సర్వీసులు ఉండవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి బస్సు ఎక్కాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :'భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదు'