CM KCR Election Campaign Today :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ శ్రేణులు దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు గులాబీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కూసుమంచి మండలం జీళ్లచెర్వులో 25 ఎకరాల్లో బహిరంగ సభ(KCR Meeting)కు భారీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ సభకు సుమారు 80 వేల మంది జనం వస్తారని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం తూర్పు దిక్కుగా భారీ సభా వేదికను సిద్ధం చేస్తున్నారు.
CM KCR Public Meeting in Paleru Today: పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం మండలాల నుంచి భారీగా కార్యకర్తలు రానున్నారని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యాప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధిపైనా ప్రజలకు స్పష్టమైన హామీలు ఇచ్చే అవకాశం ఉందని.. మేనిఫెస్టో(BRS Manifesto)ను ప్రజలోకి తీసుకువెళ్లనున్నారు.
KCR Medchal Jadcherla Tour Today : ప్రచారంలో కారు జోరు.. నేడు జడ్చర్ల, మేడ్చల్‌లో కేసీఆర్ సభలు
"దాదాపు 80 వేల మంది ప్రజలు కేసీఆర్ సభకు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సభ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను." - కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి
CM KCR Public Meeting in Khammam: పాలేరు సభ అనంతరం మహబూబాబాద్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. సీఎం బహిరంగ సభ కోసం మానుకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పట్టణ కూడళ్లు గులాబీమయంగా మారాయి. హెలీప్యాడ్, సభా ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్(MLA Shankar Naik) పరిశీలించారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు.