తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ బయటికొచ్చి ప్రజలకు నిజాలు చెప్పాలి: సీఎల్పీ నేత భట్టి - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిరలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

batti vikramarka
కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: భట్టి

By

Published : Jul 7, 2020, 5:19 PM IST

Updated : Jul 7, 2020, 7:07 PM IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలంతా కరోనాతో ఇబ్బందులు పడుతుంటే... సచివాలయాన్ని కూల్చివేత పనులు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

ఎన్నికల హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర సంపదను ధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని... మూడు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రాష్ట్ర సంపదను తరచుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా... బయటకొచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని భట్టి డిమాండ్​ చేశారు.

కేసీఆర్ బయటికొచ్చి ప్రజలకు నిజాలు చెప్పాలి: సీఎల్పీ నేత భట్టి

ఇవీ చూడండి:కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత

Last Updated : Jul 7, 2020, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details