తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాతీయ రహదారులే ఇలా ఉంటే గ్రామీణ రహదారులు?' - bhatti on national highways

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా వైరా నుంచి భద్రాచలం వెళ్తూ..  తల్లాడ మండలం మంగాపురం క్రాస్‌రోడ్‌ వద్ద పూర్తిగా దెబ్బతిన్న జాతీయ రహదారిని పరిశీలించారు.

Clp leader bhatti vikramarka
జాతీయ రహదారి పరిశీలన

By

Published : Nov 27, 2019, 11:41 PM IST

Updated : Nov 27, 2019, 11:47 PM IST

రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా నుంచి భద్రాచలం వెళ్తూ.. తల్లాడ మండలం మంగాపురం క్రాస్‌రోడ్‌ వద్ద పూర్తిగా దెబ్బతిన్న జాతీయ రహదారిని భట్టి పరిశీలించారు. సత్తుపల్లి- ఖమ్మం రహదారిలో పెద్ద పెద్ద గోతులు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. కనీసం గుంతలు పూడ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ప్రభుత్వం ప్రగతిభవన్‌, కాళేశ్వరం అభివృద్ధిని చూపిస్తూ మిగతా వాటిని విస్మరిస్తోందని మండిపడ్డారు. రహదారులు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ప్రయాణాలు కష్టంగా ఉంటాయన్నారు. జాతీయ రహదారుల పరిస్థితే అధ్వాన్నంగా ఉంటే గ్రామీణ రహదారుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని అన్నారు.

జాతీయ రహదారి పరిశీలన
Last Updated : Nov 27, 2019, 11:47 PM IST

ABOUT THE AUTHOR

...view details