ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అశ్వారావుపేట సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఓటర్ నమోదు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ హాజరయ్యారు.
కాంగ్రెస్పార్టీ అభ్యర్థిని గెలుపించుకుందాం: భట్టి విక్రమార్క - Graduate MLC Latest News
సత్తుపల్లి మండలం గంగారంలో ఓటర్ నమోదు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపించుకుందామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్పార్టీ అభ్యర్థిని గెలుపించుకుందాం: భట్టి విక్రమార్క
రాష్ట్రాన్ని దేశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టిపీడిస్తున్నాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. రైతు సోదరులకు వ్యతిరేకంగా భాజపా ప్రభుత్వం మూడు బిల్లులు తీసుకొచ్చిందని దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండిఃదసరా వేళ బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లు