ఖమ్మంలో 13 ఏళ్ల బాలికపై దుర్మార్గంగా ప్రవర్తించిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలి నివాసానికి వెళ్లిన భట్టి విక్రమార్క.. బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇంట్లో పనిమనిషిగా చేరిన బాలికపై పైశాచికంగా ప్రవర్తించడం హృదయవిదారకమన్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని కోరారు.