ఖమ్మం జిల్లా వైరాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు నిర్బంధించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద జల దీక్షకు వెళ్లేందుకు భట్టితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వైరా చేరుకున్నారు.
గృహనిర్బంధంలో సీఎల్పీ నేత భట్టి - ఖమ్మం జిల్లా వార్తలు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖమ్మం జిల్లా వైరాలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. జల దీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
గృహనిర్బంధంలో సీఎల్పీ నేత భట్టి
భట్టి నివాసం నుంచి జల దీక్షకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా వైరా ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకొని గృహనిర్బంధంలో ఉంచారు.
ఇదీ చదవండి:ఈనెల 17న జగన్, కేసీఆర్తో ప్రధాని భేటీ