కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఆ చట్టాలు చెబుతోంది కరెక్టేనని ఎలా అంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రతి గింజను కొంటానని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎక్కడైనా అమ్ముకోండని రైతులకు ఎలా చెబుతారని నిలదీశారు.
'కేసీఆర్ తన స్వార్థం కోసం రైతులను పణంగా పెట్టారు' - bhatti vikramarka fires on kcr government
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు అత్యంత దుర్మార్గమైనవని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వాటికి మద్దతు పలుకుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. తన ఆర్థిక సామ్రాజ్యంపై జరగబోయే దాడులకు భయపడి నిర్ణయం మార్చుకున్నారని అన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సీఎం కేసీఆర్ తన ఆర్థిక సామ్రాజ్యంపై జరగబోయే దాడులకు భయపడే తెలంగాణ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని పణంగా పెట్టారని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈనెల 17న ఖమ్మంలో 5 కిలోమీటర్ల మేర మానవహారాన్ని నిర్వహిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
- ఇదీ చూడండి :నోటిదురుసు నేతలు- అన్నదాతలపై అభాండాలు