తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద బాధితులను వదిలేసి వజ్రోత్సవాలు జరపడం సరికాదన్న భట్టి - గోదావరి వరద బాధితులు

Bhatti Vikramarka Comments తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్​ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుమ్ముగూడెం మండలంలోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తోన్న తమను పోలీసులు అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వరద బాధితులను వదిలేసి వజ్రోత్సవాలు జరపడం సరికాదని వ్యాఖ్యానించారు.

CLP Leader Bhatti vikramarka fire on TRS Government
CLP Leader Bhatti vikramarka fire on TRS Government

By

Published : Aug 16, 2022, 8:57 PM IST

వరద బాధితులను వదిలేసి వజ్రోత్సవాలు జరపడం సరికాదన్న భట్టి

Bhatti Vikramarka Comments: ఒకవైపు గోదావరి వరద బారినపడి సర్వస్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న బాధితులను వదిలేసి వజ్రోత్సవాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరైంది కాదని సీఎల్పీ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులుగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవటం దుర్మార్గమని మండిపడ్డారు. దుమ్ముగూడెంలో జరిగిన లోపాలు ప్రజలకు తెలియజేస్తామని ప్రభుత్వం తమను అడ్డుకుందని ఆరోపించారు. కరకట్ట పొడిగించి.. ఐదు పంచాయతీలను కలపాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని భట్టి తెలిపారు.

MLA Sridharbabu Comments: రాబోయే వరదలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు విమర్శించారు. వరద వల్ల ప్రజల బతుకులు ఛిద్రంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో భద్రాద్రికి ప్రకటించిన 100 కోట్లు ఇవ్వకపోగా.. గత నెలలో వచ్చి ప్రకటించిన 1000 కోట్లు నెలరోజులు గడుస్తున్న విడుదల చేయలేదని ఆరోపించారు.

"గోదావరి వరద బాధితులను వదిలేసి వజ్రోత్సవాలు జరపడం సరికాదు. కరకట్ట పొడిగించాలని 5 పంచాయతీలు కలపాలని సర్కారుకు లేఖ రాస్తాం. రాబోయే వరదలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది. గతంలో భద్రాద్రికి ప్రకటించిన రూ.100 కోట్లు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇక మొన్న వచ్చి ప్రకటించిన 1000 కోట్ల సంగతి దేవుడెరుగు."- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details