ఉచితంగా యూరియా ఇస్తామని చెప్పి రైతులను తెరాస ప్రభుత్వం మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పైనంపల్లి నుంచి నేలకొండపల్లి వరకు భట్టి పాదయాత్ర చేశారు. నేలకొండపల్లిలోని సీతారామ ఫంక్షన్ హాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సాగుచట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.
ఉచితంగా యూరియా ఇస్తామని చెప్పి మోసం చేశారు: భట్టి - ఖమ్మం జిల్లా వార్తలు
సాగుచట్టాలపై రైతులు పోరాటం చేయడంలో న్యాయం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని పైనంపల్లి నుంచి నేలకొండపల్లి వరకు పాదయాత్ర చేసిన భట్టి.. అక్కడే రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉచితంగా యూరియా ఇస్తామని చెప్పి మోసం చేశారు: భట్టి
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధుయాష్కీ, సీనియర్ నాయకులు హనుమంతరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.