తెలంగాణ

telangana

ETV Bharat / state

హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం: భట్టి - తెలంగాణ వార్తలు

ఖమ్మం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత భట్టి ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ ఒంటెద్దు పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారని విమర్శించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

clp-leader-bhatti-vikramarka-about-congress-will-win-in-khammam-corporation-elections
హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం: భట్టి

By

Published : Feb 7, 2021, 11:30 AM IST

రానున్న ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాల నుంచి నగరాన్ని కాపాడటమే ఎజెండాగా ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తామన్నారు. నగర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని భట్టి ఆరోపించారు.

మంత్రి పువ్వాడ అజయ్ ఒంటెద్దు పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారని విమర్శించారు. ఖమ్మంలో పార్టీ ముఖ్య నేతల పర్యటన, ఎన్నికల సన్నద్ధతపై భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం: భట్టి

ఇదీ చదవండి:ల్యాబ్​ తరగతులు మాత్రమే కళాశాలల్లో : జేఎన్​టీయూ

ABOUT THE AUTHOR

...view details