నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి: భట్టి - నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి: భట్టి
నైతిక విలువలతో కూడిన విద్యనందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ అధ్యక్షుడు లింగాల కమల్‌రాజ్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు వారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి: భట్టి
విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి హాజరయ్యారు. నాణ్యమైన విద్య అందించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందని అభిప్రాయపడ్డారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.