తెలంగాణ

telangana

ETV Bharat / state

చైనా దాడులు చేస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది: భట్టి - ఖమ్మం జిల్లా వార్తలు

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అమరవీరులకు సలాం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో గాంధీ విగ్రహం వద్ద భారత జవాన్లకు నివాళులు అర్పించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

Clp leader bhatti on central government on the issue of boarder fight
చైనా దాడులు చేస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది: భట్టి

By

Published : Jun 26, 2020, 3:57 PM IST

చైనా దాడులు చేస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది: భట్టి

చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంటే భారత ప్రభుత్వం ఏం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అమరవీరులకు సలాం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో గాంధీ విగ్రహం వద్ద భారత జవాన్లకు నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను ప్రజలు మరిచిపోరన్నారు. కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి జాతి అండగా ఉంటుందన్నారు.

చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంటే భాజపా ప్రభుత్వం ఏం చేస్తోంది. ఆయుధాలు లేకుండా సైనికులను ఎలా పంపిస్తారు? కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి జాతి అండగా ఉంటుంది.

---- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇవీ చూడండి:గల్వాన్‌ ఘటన కేంద్రం వైఫల్యమే: ఉత్తమ్​కుమార్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details