తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసింది: భట్టి

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఖమ్మం జిల్లా ఆస్పత్రిని సందర్శించిన భట్టి.. వైద్య సేవలపై ఆరాతీశారు. కొవిడ్​ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చేంతవరకు మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్​ చేశారు.

clp leader bhatti made allegations that government failed in corona control
ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసింది: భట్టి

By

Published : Aug 5, 2020, 6:06 PM IST

ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా కల్పించడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడం వల్లనే కొవిడ్​ మరణాలు సంభవిస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ నేతలతో కలిసి ఖమ్మం జిల్లా ఆస్పత్రిని భట్టి సందర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

జిల్లాలో కరోనాను నియంత్రించడంలో మంత్రి పువ్వాడ అజయ్​ విఫలమయ్యారని భట్టి ఆరోపించారు. ఉపాధి హామీ పనులకు శంకుస్థాపన చేయడం, హరితహారంలో మొక్కలు నాటడం అభివృద్ధి కాదన్నారు. జిల్లా యంత్రాంగాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత.. మంత్రి తీసుకోవాలని సూచించారు.

కరోనా నియంత్రణలోకి వచ్చేంతవరకు గ్రామాల్లోని మద్యం దుకాణాలను మూసేయాలని భట్టి డిమాండ్​ చేశారు. అనుమానంతో వచ్చిన ప్రతీ వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఐసోలేషన్​ కేంద్రాల్లో చికిత్స అందించాలన్నారు. వైద్యశాఖలో అన్ని స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు.

ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసింది: భట్టి

ఇవీచూడండి:నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేసిన కరోనా

ABOUT THE AUTHOR

...view details