తెరాస ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి దాపురించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆరేళ్ల తెరాస పాలనలో రాష్ట్ర భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని.. రాష్ట్ర ఆదాయం పెరిగేందుకు ప్రభుత్వం ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. అవినీతికి ఆస్కారం ఉన్న ఒకటి, రెండు ప్రాజెక్టులను మాత్రమే తెరాస ప్రభుత్వం చేపట్టిందని..ప్రజలకు పనికొచ్చే సంక్షేమ రంగాన్ని పూర్తిగా పక్కనబెట్టిందని దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారు: భట్టి
తెరాస రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాదైన సందర్భంగా కేసీఆర్ పాలనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శల వర్షం గుప్పించారు. కేసీఆర్ ఆరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆక్షేపించారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారు: భట్టి
ఆరేళ్ల తెరాస పాలనలో ఒక్కఎకరానికైనా కొత్తగా సాగునీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు ఊసేలేదని విమర్శించారు. మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆక్షేపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రోత్సహించారని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.
ఇవీచూడండి: దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుదాం: కేసీఆర్