ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి ఇటీవల మృతి చెందగా సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆయన నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్నా.. మరణాలు పెరుగుతోన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిందని భట్టి విమర్శించారు.
మాజీ సర్పంచ్ కుటుంబసభ్యులను పరామర్శించిన భట్టి - clp leader bhatti vikramarka visited former sarpanch satyanarayana
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబసభ్యులను సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పరామర్శించారు.
![మాజీ సర్పంచ్ కుటుంబసభ్యులను పరామర్శించిన భట్టి clp leader bhatti fired on government on corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8210421-777-8210421-1595957174815.jpg)
కరోనా రాకముందే చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ కోరితే.. కరోనాను రాష్ట్రంలో రానివ్వమని.. మాస్కులు లేకుండానే పని చేస్తామని సీఎం కేసీఆర్ ఎగతాళిగా మాట్లాడాని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి మద్యం అమ్మకాలు, సచివాలయం కూల్చివేత, కాంట్రాక్టర్లకు టెండర్ల ప్రక్రియపై ఉన్న ధ్యాస ప్రజలు ప్రాణాలు, కరోనా కట్టడిపై లేదని ధ్వజమెత్తారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఆరోగ్యశాఖ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి:-మార్స్ యాత్రకు కౌంట్‌డౌన్- రోవర్ విశేషాలు తెలుసా?